Monday, December 23, 2024

పాశ్చాత్య విధానాల కారణంగానే ఉక్రెయిన్ పై సైనిక చర్య: వ్లాదిమీర్ పుతిన్

- Advertisement -
- Advertisement -

 

For Security of Our Motherland': Vladimir Putin Delivers Victory Day Speech  in Moscow

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  ‘విక్టరీ డే’ ప్రసంగంలో శనివారం ఉక్రెయిన్‌లో సైనిక చర్య పాశ్చాత్య విధానాలకు సకాలంలో, అవసరమైన ప్రతిస్పందన అని అన్నారు. తూర్పు ఉక్రేనియన్ డాన్‌బాస్ ప్రాంతంలో పోరాడుతున్న దళాలు మరియు వాలంటీర్లు తమ మాతృభూమి కోసం పోరాడుతున్నారని తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.  “ప్రతి సైనికుడు, అధికారి మరణం మాకు బాధాకరమైనది. వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడానికి దేశం ప్రతిదీ చేస్తుంది. రష్యా కోసం, విజయం కోసం, హుర్రే!”  అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.  రష్యా యొక్క ‘విక్టరీ డే’, 1945లో 2వ ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్,  నాజీ జర్మనీని ఓడించడాన్ని స్మరించుకునేది.  దేశవ్యాప్తంగా భారీ సైనిక కవాతులు జరుగుతాయి. అధ్యక్షుడు పుతిన్ రెడ్ స్క్వేర్ నుండి తన వార్షిక ప్రసంగం చేసారు.

Russia army

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News