Monday, December 23, 2024

వరంగల్ కలెక్టరేట్ లో పత్తిమిల్లు యజమాని ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

Cotton Mill Owner Suicide attempt at Warangal Collectorate

వరంగల్: ఓ పత్తిమిల్లు యజమాని జిల్లా కలెక్టరేట్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కు వచ్చిన పత్తిమిల్లు యజమాని రఘురాం.. పత్తిమిల్లు నడిపేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపించాడు. ఇదివరకే రూ.45వేలు లంచ ఇచ్చానని.. మరిన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన మిల్లుకు పత్తి కేటాయించడంలేదని కలెక్టరేట్ లో రఘురాం ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Cotton Mill Owner Suicide attempt at Warangal Collectorate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News