Monday, December 23, 2024

వాళ్లు ఒయు అభివృద్ధిలో పాలుపంచుకోవాలి: రవీందర్

- Advertisement -
- Advertisement -

They should be involved in development of OU

హైదరాబాద్: సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో విద్యార్థులు ముందుకు రావాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లో టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసిన టెక్సోత్సవ్ ను 2022 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడారు. యూనివర్శిటీ అభివృద్ధిలో పూర్వవిద్యార్థుల భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, కేవలం నిధుల సమీకరణే కాకుండా వారి జ్ఞానాన్ని నేటి విద్యార్థులతో పంచుకోవాలని సూచించారు. ఇక్కడ చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించిన పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లోని శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక వేత్తలు  ఒయు అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రీపార్మ్, పర్ఫ్మార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ముందుకు సాగుతామని చెప్పారు. విద్యార్థుల ఆలోచనలను వర్శిటీతో పంచుకోవాలని అప్పుడే సరికొత్త ఆవిష్కరణలకు అడుగుపడుతుందని అన్నారు. తెలంగాణ పండుగల్లో సంస్కృతి, సంప్రదాయం, ఆహార పద్దతులు ఉట్టిపడినట్లే, ఉస్మానియా విద్యార్థుల ఉత్సవాలు సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు వేదిక కావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీ విద్యార్థినులతో సమావేశ మందిరం కిక్కిరిసిపోవటంతో…. భవిష్యత్తులో బాలురకు 33శాతం రిజర్వేషన్ పెట్టాల్సి రావొచ్చని చలోక్తి విసిరారు. విద్యార్థుల్లో సంపూర్ణ అవగాహన కోసం ఇలాంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు.

ఒయు టెక్నాలజీ పూర్వవిద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజమహేందర్ రెడ్డి అన్నారు. కెమికల్ పరిశ్రమల్లో విద్యార్థులకు అద్భుత అవకాశాలు ఉన్నాయని భగీరథ కెమికల్ ఇండస్ట్రీస్ సిఇఒ అరవింద్ కుమార్ చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థీ తనేంటో నిరూపించుకోవాలని టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ చింతా సాయిలు అన్నారు. ఈ కార్యక్రమమంలో పలువురు పూర్వవిద్యార్థులు, కళాశాల అధ్యాపకవర్గం, విద్యార్థినీ విద్యార్థులు పొల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News