Saturday, December 21, 2024

బైక్ నుంచి బస్సు వరకు అన్ని వాహనాల లైఫ్‌ట్యాక్స్ పెంపు

- Advertisement -
- Advertisement -

Life tax increase for all vehicles from bike to bus

మనతెలంగాణ/హైదరాబాద్ : బైక్ నుంచి బస్సు వరకు అన్ని వాహనాల లైఫ్‌ట్యాక్స్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. కొత్త, పాత వాహనాలకు ఈ మార్పు వర్తించనుంది. లైఫ్ ట్యాక్స్‌ను పెంచుతూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం జీఓ జారీ చేశారు. లైఫ్ టాక్స్ పెంపు నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1,400 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరనుంది. సోమవారం నుంచి లైఫ్ ట్యాక్స్ అమల్లోకి రానుందని ఈ జిఓలో కమిషనర్ పేర్కొన్నారు. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్ (1963)లో పేర్కొన్న చార్జీలను పెంచుతూ దానికి అనుగుణంగా మూడవ, ఆరవ, ఏడో షెడ్యూళ్లను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత చట్టంలోని శ్లాబ్ సిస్టమ్‌లోనూ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మార్పులను చేశారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే లైఫ్ ట్యాక్స్ స్ట్రక్చర్లో మార్పులు చేసి వీలైనంత ఎక్కువ ఆదాయం సమకూరేలా ఈ జీఓను రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రూపొందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News