- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 329వ ఆరాధన ఉత్సవాల గోడ పత్రికను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోమవారం నాడు ఆయన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన భేటీ అయ్యారు. ఈ నెల 11వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు హైదరాబాదు ట్యాంక్ బండ్ వేదికగా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన ఉత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ పత్రికావిష్కరణ కార్యక్రమంలో ఉత్సవ సమితి కన్వినర్ అడ్లూరి రవీంద్రా చారి, సెక్రటరీ అన్నభీమోజు జితేంద్ర, నందిపేట రవీందర్, రాయబండి పాండురంగాచారి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -