Friday, April 18, 2025

కెప్టెన్‌గా రూపిందర్

- Advertisement -
- Advertisement -

Indian hockey team selected for the Asia Cup

ఆసియా కప్‌కు భారత హాకీ జట్టు ఎంపిక

భువనేశ్వర్: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత పురుషుల జట్టును సోమవారం ఎంపిక చేశారు. ఈ నెల 23 నుంచి జూన్ ఒకటి వరకు ఇండోనేషియా రాజధాని జకర్తాలో ఈ టోర్నీ జరుగనుంది. దీని కోసం 20 మందితో కూడిన జట్టును హాకీ సంఘం సోమవారం ప్రకటించింది. పెనాల్టీ కార్నర్ నిపుణుడు రూపిందర్‌పాల్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మరో స్టార్ ఆటగాడు బీరేంద్ర లక్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇక ఈసారి దాదాపు 10 మంది కొత్త ఆటగాళ్లను జట్టుకు ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు జపాన్, పాకిస్థాన్, ఇండోనేషియా ఒకే గ్రూపులో ఉన్నాయి. మలేషియా, కొరియా, ఒమాన్, బంగ్లాదేశ్ మరో గ్రూపులో ఉన్నాయి.

జట్టు వివరాలు: రూపిందర్ పాల్ సింగ్ (కెప్టెన్), బీరేంద్ర లక్కా, మన్‌జీత్, డిప్సన్ టిర్కీ, యశ్‌దీప్, అభిషేక్ లక్రా, పంకజ్ కుమార్, సూరజ్, విష్ణుకాంత్ సింగ్, రాజ్‌కుమార్ పాల్, మరీశ్వరన్ సక్తివెల్, శేష గౌడ, సిమ్రన్‌జీత్, పవన్, సుదేవ్, సునీల్, ఉత్తమ్ , కార్తీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News