Monday, December 23, 2024

ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా…

- Advertisement -
- Advertisement -

Major Theatrical trailer release

యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. 2.28 నిమిషాల ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వుంది. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, లవ్ లైఫ్, వార్ .. ఇలా ప్రతీది ట్రైలర్‌లో గూస్ బంప్స్ మూమెంట్స్‌గా ఉన్నాయి. ట్రైలర్‌లో 26/11 ఎటాక్ విజువల్స్ నెక్స్ లెవెల్‌లో వున్నాయి. అడివి శేష్ మేజర్ సందీప్‌గా పరకాయ ప్రవేశం చేశారు. ప్రకాష్ రాజ్ వాయిస్ ,డైలాగ్స్, ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ… “ఈ సినిమా చూశాను. కొన్ని సీన్లు చూస్తున్నపుడు గూస్ బంప్స్ వచ్చాయి.

చివరి 30 నిమిషాలు నా గొంతు తడారిపోయింది. సినిమా పూర్తయిన తరువాత ఏం మాట్లాడలేకపోయాను. రెండు నిమిషాల మౌనం తర్వాత శేష్‌ని హాగ్ చేసుకున్నాను. బయోపిక్ తీయడం చాలా బాధ్యత కూడుకున్నది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వీరుడి కథ చెప్పినపుడు ఆ బాధ్యత ఇంకా పెరుగుతుంది. సినిమా టీం మొత్తం ఆ బాధ్యతని చక్కగా నిర్వహించింది”అని అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ “మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సింపుల్ మ్యాన్. అమ్మనాన్న, స్నేహితులు, చైల్డ్ హుడ్ క్రష్, గర్ల్ ఫ్రండ్… ఇలా మనందరిలానే అతని జీవితం కూడా సాధారణం. అయితే అంత సాధారణమైన మేజర్ సందీప్ ఒక అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యారనేది ‘మేజర్’లో చూస్తారు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరెంట్స్ కోరిక ఒక్కటే. మేజర్ సందీప్ జ్ఞాపకాలు ఎప్పటిక్కీ నిలిచిపోవాలని కోరుకున్నారు. ‘మేజర్’ చిత్రం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది”అని తెలిపారు. దర్శకుడు శశి కిరణ్ తిక్క మాట్లాడుతూ “2018లో అడవి శేష్ ఈ కథ చెప్పారు. నేను కూడా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై రీసెర్చ్ చేశాను. మహేష్ మా వెనుక ఉండటం ఒక ప్రత్యేకమైన బలం. అడివి శేష్‌తో రెండు సినిమాలు చేశాను. కష్టపడటంలో శేష్‌తో పోటిపడితే చాలు మనం విజయం సాధించినట్లే”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయి మంజ్రేకర్, అనురాగ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News