Wednesday, January 22, 2025

జర్మనీ నదిలో హన్మకొండ యువకుడి గల్లంతు

- Advertisement -
- Advertisement -

ప్రమాదవశాత్తూ నదిలో పడినట్లు వరంగల్ ఎంఎల్‌ఎ నన్నపనేని
నరేందర్ ట్వీట్ జర్మనీ అధికారులతో మాట్లాడిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం వెళ్లిన హనుమకొండ జిల్లా కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్ ప్రమాదవశాత్తు అక్కడ నదిలో గల్లంతయ్యాడు. పైచదువుల కోసం జర్మనీ వెళ్లిన కడారి అఖిల్ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతైన విషయాన్ని మంత్రి వరంగల్ తూర్పు ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కెటిఆర్ జర్మనీ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి విద్యార్థి కడారి అఖిల్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కడారి అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి కెటిఆర్ జర్మనీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు నీళ్లలో కొట్టుకుపోవడంతో అఖిల్ కుటుంబంతో పాటు బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. అఖిల్ కుటుంబాన్ని ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్ పరామర్శించారు. తమ కుమారుడిని రక్షించేలా చర్యలు తీసుకోవాలని అఖిల్ తల్లిదండ్రులు ఎంఎల్‌ఎ నన్నపనేని నరేందర్‌ను అభ్యర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News