Monday, December 23, 2024

రైలులో ప్రయోగాత్మకంగా బేబీ బెర్త్

- Advertisement -
- Advertisement -

Indian Railways introduces baby berth

తల్లీ బిడ్డకు సౌకర్యవంత ప్రయాణం…

న్యూఢిల్లీ : పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ ఓ కొత్త ఏర్పాటును ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. అదే ఫోల్డబుల్ బేబీ బెర్త్. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్నపాటి పడక ఇది. లోయర్ బెర్త్‌కు అటాచ్ అయి ఉంటుంది. ప్రయాణ సమయంలో తల్లులు ఈ బెర్త్‌పై తమ శిశువులను పడుకోబెట్ట వచ్చు. సాధారణంగా అయితే ఒకే బెర్త్‌పై తల్లీబిడ్డ సర్దుబాటు కావాల్సి ఉంటుంది. దీంతో స్థలం సరిపడక ఇబ్బందులు తప్పేవి కావు. ఇప్పుడు బేబీ బెర్త్ సాయంతో బుజ్జాయిలను తమ పక్కనే సురక్షితంగా పడుకోబెట్టవచ్చు. మాతృదినోత్సవం సందర్భంగా ఉత్తర రైల్వే మండలం ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకురావడం విశేషం. లఖ్‌నవూ, ఢిల్లీ డివిజన్ల సమన్వయంతో లఖ్‌నవూ డివిజన్ డివిజనల్ మెకానికల్ ఇంజినీర్ అతుల్ సింగ్ మాట్లాడుతూ బేబీబెర్త్‌ను మెయిన్ లోయర్ బెర్త్‌తో జత చేశాం. అవసరం లేనప్పుడు దీన్ని లోయర్ బెర్త్ కిందకి మడత బెట్టొచ్చు. దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అని వివరించారు. 770 మిమీ పొడవు, 225 మిమీ వెడల్పు ,76.2 మిమీ ఎత్తు కలిగిన ఈ బేబీ బెర్త్‌కు శిశువును సురక్షితంగా పట్టి ఉంచడానికి పట్టీలూ ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News