మటన్ కూడా పైపైకి, నాన్ వెజ్ ప్రియులకు చుక్కలు..
మన తెలంగాణ/హైదరాబాద్ : నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారు ఉండరు..? ఎవరో ఒకరిద్దరూ తప్ప అంతా ఇష్టంగా లాగించేస్తారు. కరోనా వల్ల మాంసాహారానికి డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా చికెన్, ఎగ్స్ సేల్స్ పెరిగాయి. అదీ అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ సేల్స్ పెరుగుతున్నాయి. కానీ సమ్మర్‌లో మాంసం ధరలు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదీ నాన్ వెజ్ ప్రియులకు మింగుడుపడటం లేదు.
చికెన్ ధరలు పైపైకి…
చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారంలో రెండు సార్లు చికెన్ తినేవారు కూడా పప్పన్నంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు విపరీతంగా ఉండటం, వేడి గాలుల తీవ్రతతో ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. కిలో చికెన్ ధర రూ. 300కు చేరింది. గత వారం రోజుల్లో కిలో చికెన్ ధర రూ. 50 నుంచి 60 వరకు పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. వేసవి అందరికీ సెలవులు ఉంటాయి. ఫంక్షన్లు ఎక్కువగా జరుగుతుంటాయి. చికెన్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే నమోదవుతున్నాయి.
మటన్ సైతం…
చికెన్ అలా అంటే ఇటు మటన్ కూడా కొండెక్కి కూర్చొంది. పదిరోజుల క్రితం కిలో మటన్ రూ. 750 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ. 800 నుంచి రూ. 850 వరకు పలుకుతుంది. సిటీలో ఏరియాను బట్టి ధర ఉంటుంది. అంటే కిలో వెయ్యి వరకు రావడంతో మటన్ కొనుగోలుకు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. చికెన్ వైపే చూద్దామంటే పరిస్థితి అలా లేదు. ఆ ధర కూడా రూ.300 కావడంతో ఏం చేయాలో తెలియడం లేదు. దీంతో నాన్ వెజ్ ప్రియులు పప్పు, ఆకు కూరతో సర్దుకుంటున్నారు.
కిలో రూ.300కు చేరిన బాయిలర్ కోడి
వేసవి స్టార్టింగ్‌లో బాయిలర్ కోడి కిలో రూ.200 వరకు ఉంది. పది రూపాయలు అటు ఇటుగా ఉంది. కానీ మెల్లగా ధరలకు రెక్కలు వచ్చాయి. రూ.300 వరకు వచ్చింది. దీంతో వారు తినేందుకు మొగ్గు చూపడం లేదు. వారానికి రెండుసార్లు తినేవారు.. ఒకసారి తీసుకుంటున్నారు. లేదంటే కోడిగుడ్డు.. లేదా.. ఇతర కూరగాయాలను తీసుకుంటున్నారు. అసలే పెట్రో ధరల భారం.. ఇటు పప్పుల ధరల మోత తప్పడం లేదు.
ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు
మరోవైపు లీటర్ ఆయిల్ రూ.205
మంచి నూనె రూ.205 వరకు పలుకుతోంది. సన్ ప్లవర్ ఆయిల్ అయితే ధర అంతలా ఉంది. కొన్నిచోట్ల స్థానికంగా లభించే బ్రాండ్లు కూడా లీటర్ మంచి నూనె రూ.170 వరకు ఉంది. ఇలా అయితే ఏం కొనాలి.. ఏం తినాలి అని జనం అంటున్నారు. అయితే చికెన్ ధరలకు రెక్కలు రావడంతో ఏం చేయాలో తెలియడం లేదు. విజిటేబుల్స్ తీసుకొని.. కానిచ్చేస్తున్నారు. నాన్ వెజ్ ధరలు తగ్గాలి అంటే.. మరో 20 రోజులు అయినా ఆగాల్సిందే.