Friday, December 20, 2024

ఐఎఫ్‌ఎస్ అధికారులకు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

1990 బ్యాచ్ ఇద్దరికి పిసిసిఎఫ్, 2004 బ్యాచ్ ముగ్గురికి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎఫ్‌ఎస్ 1990 బ్యాచ్‌కు చెందిన మోహన్ చంద్ర పర్గాయిన్, ఎలుసింగ్ మేరుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్)గా పదోన్నతి కల్పించారు. అదే విధంగా 2004 బ్యాచ్‌కి ఐఎఫ్‌ఎస్ అధికారులు ఎస్.రమేష్, డాక్టర్ బి.ప్రభాకర్, డి.భీమాలకు అటవీ ప్రధాన సంరక్షణాధికారిగా పదోన్నతిని కల్పించారు. ఐఎఫ్‌ఎస్ 1990 బ్యాచ్‌కు చెందిన మోహన్ చంద్ర పర్గాయిన్ మణుగురు సబ్ డివిజన్ అటవీ అధికారి విధుల్లో చేరి కాగజ్‌నగర్ డివిజనల్, ఖమ్మం, కరీంనగర్ అటవీశాఖ అధికారిగా, అమ్రబాద్ టైగర్ రిజర్వ్, అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, ప్రసుత్తం అదనపు పిసిసిఎఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎలుసింగ్ మేరు వివిధ హోదాల్లో జిల్లా అధికారి విధులు నిర్వహించి, ప్రసుత్తం విజిలెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరిందరికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పదోన్నతిని ప్రభుత్వం కల్పించింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా పదోన్నతి పొందిన 2004 బ్యాచ్‌కి చెందిన ఎస్.రమేష్ దూలపల్లి అటవీ అకాడమీ డైరెక్టర్‌గా, డాక్టర్ బి.ప్రభాకర్,హెచ్‌ఎండిఎ డైరెక్టర్‌గా, డి.భీమా కొత్తగూడెం సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News