Saturday, November 16, 2024

చంద్రబాబుపై అమరావతి కేసు

- Advertisement -
- Advertisement -

మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్లలో అక్రమాలపై కేసు నమోదు చేసిన ఎపి సిఐడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ డిజైన్లో అక్రమాలపై మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ సిఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై మంగళగిరి సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి మాజీ సిఎం చంద్రబాబులతో పాటు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్యరాజశేఖర్, ఎల్‌ఇపిఎల్ ప్రాజెక్ట్, రామకృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్ అంజనీకుమార్‌పైనా సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అవకతవకలు జరిగాయని గతనెల 27న సిఐడికి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈనెల 6న విచారణ చేపట్టిన సిఐడి పోలీసులు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. ముఖ్యంగా 2014, 20-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎంఎల్‌ఎ ఫిర్యాదు మేరకు ఈనెల 9న నిందితులపై ఐపిసి సెక్షన్ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167, 217 సెక్షన్లతో పాటు అవినితి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1)(ఎ) కింద కేసు నమోదు చేసినట్లు సిఐడి పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News