Monday, December 23, 2024

విషాదం.. పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Bridegroom Commit Suicide before marriage in Vizag

విశాఖ: తెల్లారితే పెళ్లి.. ఇంతలో పెళ్లికుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ సంఘటన జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని జై ఆంధ్ర కాలనీలో చోటుచేసుకుంది. ఈరోజు పెళ్లి జరగాల్సి ఉండగా.. కొన్ని గంటల ముందు వరుడు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Bridegroom Commit Suicide before marriage in Vizag

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News