Monday, December 23, 2024

తమన్నా కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్

- Advertisement -
- Advertisement -

Tamannah act in F3 Movie

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్3’తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహ్రీన్ సందడి చేయబోతున్నారు. తాజాగా విడుదలైన ‘ఎఫ్ 3’ థియేట్రికల్ ట్రైలర్ ఫన్ బ్లాస్ట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో తమన్నా చేసిన హారిక పాత్ర ఒక మేజర్ హైలెట్‌గా ఉండబోతోంది. ‘ఎఫ్ 3’ కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా కనిపించనుంది. హారిక పాత్రని అద్భుతంగా డిజైన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్ 3’ కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది. నటనకి ఆస్కారం ఉన్న ఈ పాత్రలో తమన్నా నటన నెక్స్ లెవెల్‌లో ఉంటుంది. వెంకటేష్-, తమన్నాల మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్ గా ఉండబోతున్నాయి.

‘మన ఆశలే మన విలువలు’ అంటూ తమన్నా చేసిన హారిక పాత్ర చెప్పిన క్యాచి డైలాగ్ ఇది. ఈ డైలాగ్ హారిక క్యారెక్టరైజేషన్‌లో కీలకంగా వుంటుంది. ఆశలతో మేడలు కట్టే హారికకి సోనాల్ చౌహాన్ పాత్ర పరిచయంతో కథలో బ్రిలియంట్ సర్‌ప్రైజ్ రాబోతుంది. ఈ సర్‌ప్రైజ్ సినిమాలో ఎక్స్‌ట్రార్డినరీగా ఉండబోతుంది. తమన్నా కెరీర్‌లోనే ఈ పాత్ర ది బెస్ట్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ‘ఎఫ్ 3’ నుండి తమన్నా రెడ్ హాట్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ పార్టీ సాంగ్‌లో సందడి చేయబోతున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, అలీ, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News