- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 57 మంది సభ్యులు జూన్, ఆగష్టు మధ్య పదవీ విరమణ చేయనున్నందున ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ,ఎపి సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 2, ఎపిలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 57 స్థానాల రాజ్యసభ స్థానాలకు ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ కానుంది. జూన్ 10న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. గరిష్టంగా 11 స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. దాని తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు ఒక్కో రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
- Advertisement -