Monday, December 23, 2024

మోడీజీ మీరు భారత్‌కు ప్రధాని, గుజరాత్‌కు మాత్రమే కాదు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Modi Ji you are PM of India not just of Gujarat: KTR

హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న మంత్రి కెటిఆర్.. తాజాగా గురువారం కూడా నేరుగా ప్రధాని నరేంద్ర మోడీనే టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మోడీజీ, మీరు భారత దేశానికి ప్రధాని, కేవలం గుజరాత్‌కు మాత్రమే ప్రధాని కాదు’ అంటూ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా మోడీపై విమర్శలు గుప్పించారు. గురువారం గుజరాత్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో మాట్లాడిన సందర్భంగా మోడీ కాస్తంత ఎమోషనల్ అయ్యారు. తన కూతురు వైద్య విద్యనభ్యసించలేకపోయిందంటూ గుజరాత్‌కు చెందిన అయూబ్ పటేల్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తపర్చగా మోడీ ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై తాను దృష్టి సారిస్తానని.. మీ కుమార్తె వైద్య విద్య అభ్యసించేందుకు ఏమైనా సాయం చేయగలమోమో పరిశీలిస్తామని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రాగానే.. దాని ఆధారంగనే మోడీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ విమర్శలు చేశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల కూడా మంజూరు చేయకుండా రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది విద్యార్థుల ఆశయాలను నీరుగార్చారని మోడీపై ఆయన విరుచుకుపడ్డారు. అభివృద్థి పథంలో దూసుకుపోతున్న తెలంగాణపై ఈ వివక్ష ఎందుకని కూడా కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News