Monday, December 23, 2024

సాలార్జంగ్ మ్యూజియంలో ఉచిత ప్రవేశం

- Advertisement -
- Advertisement -

 అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా వారం రోజుల పాటు వివిద సాంస్కృతిక కార్యక్రమాలు
నిరభ్యంతరంగా తమ కెమేరాలను ఉచితంగా తీసుకువెళ్ళే సౌలభ్యం
మ్యూజియం డైరెక్టర్ ప్రకటన

Pollution Threat to Salar Jung Museum

 

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా, హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో వారం రోజుల పాటు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 16 నుండి 21 వరకు ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా సందర్శకులు సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశించవచ్చన్నారు. తెలంగాణ భాష, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సాలార్జంగ్ మ్యూజియంలో ప్రాచీన వస్తువుల ఫొటోగ్రఫీ పోటీ, బిద్రీ తయారీ పై వర్క్‌షాప్, ఆర్ట్ ఎగ్జిబిషన్, జానపద కళలు వంటి వివిద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, 75 రకాల ప్రాచీనమైన, విలువైన వస్తువులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తునట్లు తెలియజేశారు. అంతే కాకుండా, పాఠశాలలో చదువుకునే పిల్లలకు కళలు, చిత్రలేఖనం మొదలైనవాటిపై శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ వారంరోజులలో ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 9:00 వరకూ సందర్శకులు కూడా తమ తమ కెమేరాలతో ఉచితంగా సాలార్జంగ్ మ్యూజియంలోకి ప్రవేశించి చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చని, ప్రైవేటు సంస్థలు కూడా పర్యాటకులను ఉచితంగా తీసుకురావచ్చని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా రాత్రివేళల్లో కూడా మ్యూజియం అందంగా కనిపించే విధంగా అలంకరించనున్నట్లు నాగేందర్ రెడ్డి తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News