- Advertisement -
అబూధాబి : యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షులుషేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖలీఫా కన్నుమూశారని అధికారిక వార్తా సంస్థలు తెలిపాయి. ఆయన మరణం పట్ల దేశాధ్యక్షుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రగాఢ సంతాపం తెలిపిందని డబ్లుఎఎం వార్తాసంస్థ వెల్లడించింది. అధ్యక్షుల మృతికి సంతాపంగా దేశంలో 40 రోజుల పాటు జాతీయ పతకాన్ని అవనతం చేసి ఉంచుతారు. తొలి మూడురోజులలో ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలకు సెలవులు ప్రకటించారు. షేక్ ఖలీఫ్ 2004 నవంబర్‌లో అబూధాబి 16వ పాలకులుగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆయన 2014 నుంచి ప్రజలలో ఎక్కడా కన్పించడం లేదు. ఓ సారి గుండెపోటు వల్ల సర్జరీ జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆయన అధికారిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ వచ్చారు.
- Advertisement -