Monday, December 23, 2024

పేదలకు అండగా టిఆర్‌ఎస్ సర్కార్

- Advertisement -
- Advertisement -

Meals at government hospitals cost only Rs 5

సర్కారు దవాఖానాలో రూ.5లకే భోజనం చేస్తున్న
ఓ అవ్వ మోముపై చిరుదరహాసం
సంబధిత ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మంత్రి హరీష్

మన తెలంగాణ/హైదరాబాద్ : పేదల సంక్షేమానికి కెసిఆర్ సర్కార్ కట్టుబడి ఉంది. నిరుపేదలకు ప్రభుత్వ దవాఖానాలలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాదు.. ప్రభుత్వ దవాఖానాల్లో చేరిన రోగులకు సహాయకులకు వచ్చేవారికి సైతం రూ.5లకే భోజన సదుపాయాన్ని కల్పించి టిఆర్‌ఎస్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఓ వైపు సంక్షేమం.. మరో వైపు ఆరోగ్యంకు సంబంధించినవన్నీ నిరుపేదలకు అందించాలన్న సత్సంకల్పంతో టిఆర్‌ఎస్ సర్కార్ చేపడుతున్న పలు కార్యక్రమాలు పేదల జీవితాల మెరుగుదలకు ఉపయుక్తం కానున్నాయి. పేదల పక్షపాతి సిఎం కెసిఆర్ తన మదిలో ఉన్న ఆలోచనలకు ఎప్పటికప్పుడు కార్యరూపాన్ని ఇస్తున్నారు. అందుకనుగుణంగా మంత్రులను, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ విషయంలోనూ పేదలు ఇబ్బంది పడకూడదన్నది సిఎం కెసిఆర్ నిశ్చితాభిప్రాయం. సిఎం కెసిఆర్ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పేదల బతుకుల ఉన్నతికి అటు మంత్రులు, ఇటు అధికారులు కృషి చేస్తున్నారు.

అందులో భాగంగా నేడు ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల తరపు వచ్చేవారికి సైతం రూ.5లకే భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్బంలో సర్కారు దవాఖానాల్లో రూ.5 లకే భోజన సహాయం తమకందుతుండటంతో రోగుల సహాయకుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. అదే క్రమంలో సర్కారు దవాఖానాలో రూ.5లకే భోజనం చేస్తున్న ఓ అవ్వ మోముపై చిరుదరహాసం వెల్లివిరిసింది. ప్రభుత్వం పేదల సంక్షేమం, ఆరోగ్యానికి కట్టుబడి ఉందని.. రోగుల సహాయకులకు రూ.5ల భోజనం ఒక వరం అని టిఆర్‌ఎస్ సర్కార్‌పై నిరుపేదలైన ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలన్న టిఆర్‌ఎస్ సర్కార్ సత్సంకల్పానికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. కాగా, సర్కార్ దవాఖానాలో రూ.5ల భోజనం చేస్తున్న అవ్వ మోముపై చిరు దరహాసానికి సంబంధించిన ఫోటోను మంత్రి హరీష్‌రావు తన ట్విట్టర్‌లో పొందు పర్చారు. రోగుల సహాయకులకు నిజంగా ఇది వరమేనని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News