Monday, December 23, 2024

హైదరాబాద్ మనందరికి గర్వకారణం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR lay foundation stone for Pumping Station at Sunkishala

నల్గొండ: ‘దేశంలో శరవేగంగా అభివృద్ధి అవుతున్న మహా నగరం మన హైదరాబాద్… మరి కొద్దిరోజుల్లో ఢిల్లీ తర్వాత మన హైదరాబాద్ రెండో అతి పెద్ద నగరంగా అవతరిస్తుంది.. ఇది మనందరికి గర్వకారణం’ అని మంత్రి కెటఆర్ అన్నారు. శనివారం ఉదయం జిల్లాలోని పెద్దవుర మండలం సుంకిషాల వద్ద హైదరాబాద్ తాగు నీటి అవసరాలను తీర్చేందుకు శాశ్వత పరిష్కారంగా జలమండలి నిర్మిస్తున్న భారీ ఇన్ టెక్ వెల్, పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ..  ”ప్రకృతి పరంగా మన హైదరాబాద్ కు ఎన్నో గొప్ప వనరులు, గొప్ప అనుకులతలు ఉన్నాయి. ఇవ్వాళ దేశ వ్యాప్తంగా మంచి నీటి కటకట ఉన్నది. మరి కొన్ని నగరాలు సకల అసౌర్యలతో సతమతం అవుతున్నాయి.
కానీ, హైదరాబాద్ నగరానికి అన్ని అనుకులతలు ఉన్నాయి. గొప్ప దర్శనీత ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నారు. హైదరాబాద్ కి రూ.1450కోట్లతో అదనంగా పదహరున్న టిఎంసిల నీటిని పంపింగ్ చేసేలా ఈ ఇన్ టెక్ వెల్ ను నిర్మిస్తున్నాం.
మోటర్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలా కూడా సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. మా అంచనా రాబోయే ఎండాకాలం వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఎమర్జెన్సీ పంపింగ్ అనే సమస్య లేకుండా ఈ పంపింగ్ స్టేషన్ ను నిర్మిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును కాలంతో పోటీ పడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేశారు.  భారత దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం కాళేశ్వరం.
వరుసగా ఏడేళ్లుగా కరువు వచ్చినా తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఏ ఆలోచన అయిన గొప్పగా ఉంటుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా కూడా వాటర్ పైప్ లైన్ లను ఏర్పాటు చేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపులా, బయట ఉన్న ప్రాంతాలకు కూడా తాగు నీటిని అందించేలా ప్లాన్ చేసాము. 2072 వరకు తాగు నీటి ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో ప్లాన్ చేశాం. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరం. మానసిక ప్రశాంతత కోసం సాగర్ లో బుద్ధవనం ఏర్పాటు చేశారు” అని పేర్కొన్నారు.

KTR lay foundation stone for Pumping Station at Sunkishala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News