నల్గొండ: జిల్లాలోని హాలియలో రూ.50 కోట్లతో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ”సాగర్ ఉప ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఇక్కడ గులాబీ జెండా ఎగిరిన తర్వాత ఇప్పటి వరకు రూ.830 కోట్ల అభివృద్ధి పనులు చేసాం. సాగర్ నియోజకవర్గంలో… రూ.680 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్ పనులు కోనసాగుతున్నాయి. చివరి ఆయకట్టుకు నీరు అందిస్తాం. రానున్న రోజుల్లో సాగర్ నియోజకవర్గంలో నీరు అందని టైల్ ఎండ్ భూమి అంటూ ఉండదు. రూ.3.75 కోట్లతో హాలియలో స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నాం. మరో రూ.15 కోట్లు డ్రైనేజీ పనులకు మంజూరు చేస్తున్నాం. ఇక్కడి విపక్ష నాయకుల చేతకాని తనం వల్లనే ఫ్లోరైడ్ మహమ్మారి జిల్లా ప్రజలను జీవచ్చావాళ్లుగా మార్చారు. ఫ్లోరైడ్ సమస్యపై జాతీయ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆనాడు ఇచ్చిన మాటను నిలుపుకుంటూ అధికారంలోకి రాగానే భగీరథ పథకం ద్వారా ఇంటింటికి సురక్షిత జలాలని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. ఫ్లోరైడ్ మహమ్మరిని అంతం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవ్వాళ గ్రామాల్లో ప్రజలు సంతోషంగా వున్నారు. ఆసరా పెన్షలతో వృద్ధుల గౌరవాన్ని పెంచారు సీఎం కేసీఆర్” అని అన్నారు.
KTR Speech at Haliya Public Meeting