Monday, December 23, 2024

యంగ్ స్టార్‌కు జోడీగా…

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘లైగర్’ షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ లెవెల్లో ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకానుంది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఈ సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ తోనే విజయ్ దేవరకొండ మరో సినిమా చేయబోతున్నాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమణ’ చిత్రాన్ని ఈ యంగ్ హీరో చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే హీరోయిన్‌గా ఫిక్స్ అనే మాట నిజమేనట. దీనిపై త్వరలోనే అధికారిక అప్‌డేట్ కూడా రానున్నట్టు తెలిసింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీగా తెరకెక్కనుంది. ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News