Saturday, January 4, 2025

‘జనజాగరణ్ అభియాన్’ రెండో దశపై సోనియా చర్చ

- Advertisement -
- Advertisement -

Sonia talks about second phase of 'Janajagaran Abhiyan'

ఉదయ్‌పూర్: ప్రభుత్వ విధానాలతో పాటుగా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి అంశాలపై ప్రజలకు వివరించేందుకుచేపట్టనున్న రెండో దశ ‘జనజాగరణ్ అభియాన్’ కోసం రూపొందించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో మాట్లాడారని, జనజాగరణ్ అభియాన్ రెండో దశ కోసం కార్యాచరణను రూపొందించాలని కోరారని పార్టీ వర్గాలు పిటిఐకి తెలిపాయి. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, వ్యవసాయ రంగ సంక్షోభం సహా వివిధ సమస్యలను హైలెట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ 2021 నవంబర్ 14నుంచి 29 వరకు ‘జనజాగరణ్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. మరోసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News