మెదక్: కేంద్ర ప్రభుత్వంపై వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి సభ ఓ అట్టర్ ఫ్లాఫ్ షో అన్నారు. బిజెపి సభలో శనివారం అమిత్ షా అన్నీ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఇవ్వని నిధుల్ని ఇచ్చామని, అమలుకాని పథకాల్ని అమలు చేస్తున్నామని అమిత్ షా పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టాలని చూసిందని ఆరోపించారు. అందుకే వడ్లు కొనబోమని బిజెపి తొండాట ఆడిందన్నారు. 3 వేల కోట్లు నష్టాన్ని భరించి కెసిఆర్ వడ్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. బిజెపి పార్టీలో సిఎం కావాలంటే రూ. 2500 కోట్లు లంచం ఇవ్వాలని కర్నాటక బిజెపి ఎంఎల్ఏ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. గురివిందగింజ లెక్క మీరు మాట్లాడితే ఎలా.. బిజెపికి నైతికత ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మీద, టిఆర్ఎస్ మీద అక్కసు వెళ్లగక్కారని మంత్రి హరీశ్ తెలిపారు. అమిత్ షా.. అబద్ధాల బాద్‍షా అని మంత్రి హరీశ్ ఆరోపించారు.
అమిత్ షా.. అబద్ధాల బాద్‍షా: మంత్రి హరీశ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -