ఉక్రెయిన్‌దే తుది విజయమని అంచనా
బెర్లిన్ : ఉక్రెయిన్‌తో ఇప్పటి యుద్ధంలో క్రమేపీ రష్యా బలహీనపడుతోందని, తుది విజయం ఉక్రెయిన్‌దే అవుతుందని నాటో విశ్లేషించింది. రష్యాబలగాలు ముందు తెగించాయని, తరువాత ఇప్పుడు తోకముడుస్తున్నాయని నాటో ఉప అధికారి ఒకరు బెర్లిన్‌లో తెలిపారు. ఇక్కడనే నాటో దౌత్యవేతలు, ప్రతినిధులు ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం అయ్యారు. ఈ దశలోనే నాటో డిప్యూటీ సెక్రెటరీ జనరల్ మర్సియా జియోనా రిపోర్టర్లతో మాట్లాడారు. రష్యా దెబ్బతింటున్న దశలో నాటో విస్తరణను మరింతగా చేపట్టాల్సి ఉందన్నారు. ఉక్రెయిన్‌కు ఇదే అదునుగా మరింతగా సాయం చేయాల్సి ఉందన్నారు.
రష్యాను అన్ని విధాలుగా ఇరకాటంలో పెట్టెందుకు మంచి సమయం వచ్చిందని సూచించారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ సాఓ్టటెన్‌బెర్డ్ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో డిప్యూటీనే ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అత్యంత క్రూరంగా రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. అయితే ఉక్రెయిన్ల ధైర్యం, ఆ సైనికుల వీరోచిత పోరుతో క్రమేపీ రష్యా దిక్కుతోచని స్థితిలో పడింది. ఇక వెనకకు మళ్లుతుంది. విజయం ఉక్రెయిన్‌దే అవుతుందని తెలిపారు. నాటో మరింత విస్తరణ ప్రధాన అంశంగా బెర్లిన్‌లో కీలక భేటీ సాగుతోంది. నాటో తమ దేశపు సరిహద్దులకు కూడా విస్తరించుకుంటూ రావడమే ఉక్రెయిన్‌పై తమ దాడికి కారణం అని రష్యా ప్రకటిస్తూ వస్తోంది.