- Advertisement -
ముంబై: ముద్దులుపెట్టడం,తాకడం అసహజ లైంగిక నేరాలు కావని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఓ 14ఏళ్ల బాలుడితో అలా చేశాడన్న అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి అనూజ ప్రభుదేశాయ్ బెయిల్ దరఖాస్తును ఆమోదిస్తూ తీర్పు చెప్పారు. ఆ వ్యక్తి భారతీయ శిక్షా స్మృతి 377(అసహజ నేరం), సెక్షన్ 8(లైంగిక దాడి), సెక్షన్ 12(లైంగిక వేధింపు) అభియోగాలు ఎదుర్కొన్నాడు. అతడిపై దిందోషి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. అతడిపై ఆ పిల్లాడి తండ్రే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాడు. నిందితుడి నేరాన్ని రుజువు చేసే పిల్లాడి మెడికల్ పరీక్ష రిపోర్టులు ఉన్నాయా అని జడ్జీ ప్రాసిక్యూటర్ రుతుజ అంబేకర్‌ను ప్రశ్నించారు. వ్యక్తిగత పూచీకత్తు, ప్రతి రెండు నెలలకోసారి పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇవ్వాలన్న షరతులపై నిందితుడికి జడ్జీ బెయిల్ మంజూరు చేశారు.
- Advertisement -