Friday, November 22, 2024

53 శాటిలైట్లతో స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

SpaceX rocket launch with 53 satellites

32 దేశాలకు విస్తరించిన ఇంటెర్నెట్ సర్వీస్

వాషింగ్టన్ : ప్రపంచం లోని ఇంటెర్నెట్ అనుసంధానం లేని ప్రాంతాలకు ఇంటెర్నెట్ సౌకర్యం అందుబాటు లోకి తీసుకురాడానికి భూ కక్ష లోని స్టార్‌లింగ్ ఇంటెర్నెట్ కాన్‌స్టెలేషన్ సర్వీస్‌కు 53 శాటిలైట్లతో స్పేస్ ఎక్స్ రాకెట్‌ను శుక్రవారం పంపింది. కాలిఫోర్నియా నుంచి ఈ ప్రయోగం జరిగింది. స్టార్ లింగ్ అన్నది అంతరిక్ష ఆధార వ్యవస్థ. గత కొన్నేళ్లుగా ఇది నిర్మాణమవుతోంది. దీనివల్ల ఇంటెర్నెట్ సౌకర్యం అనుసంధానం అవుతుంది. రెండు దశల్లో ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం జరిగింది. శుక్రవారం తెల్లవారు జాము 2.37 గంటలకు కాలిఫోర్నియా లోని వాండెన్‌బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ రాకెట్ బయలుదేరింది. పసిఫిక్ సముద్రంలో నిలిపిఉంచిన డ్రోన్‌షిప్ లోకి రాకెట్ మొదటి దశలో చేరుకున్న తరువాత కొద్ది నిముషాలకే భూ కక్ష దిశగా బయలు దేరింది. మొత్తం 53 శాటిలైట్లను విజయవంతంగా స్టార్‌లింక్ వద్దకు చేర్చగలిగామని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. భూమిరి 340 మైళ్ల దూరంలో భూమి చుట్టూ వందలాది స్టార్‌లింగ్ శాటిలైట్లు పరిభ్రమిస్తుంటాయి. అవన్నీ కాలిఫోర్నియా స్థావరంగా ఉన్న స్పేస్‌ఎక్స్ ప్రయోగించినవే. తమ శాటిలైట్ ఇంటెర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ ప్రస్తుతం 32 దేశాలకు అందుబాటులో ఉందని శుక్రవారం స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఇదివరకు 25 దేశాలకే ఈ సర్వీస్ అందుబాటులో ఉండగా ఇప్పుడు 32 దేశాలకు విస్తరించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News