- Advertisement -
నేడు, రేపు కూడా కురిసే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు వానలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, బోరబండ తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
- Advertisement -