Tuesday, January 14, 2025

గోధుమ ఎగుమతి నిలిపివేతపై భారత్‌ను నిందించడం తగదు

- Advertisement -
- Advertisement -

జీ 7 దేశాల విమర్శపై చైనా వ్యాఖ్య

China support on India Wheat export ban
బీజింగ్ : చైనా మరోసారి భారత్‌కు మద్దతుగా గొంతు విప్పింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలను నిందించడం వల్ల ప్రపంచ ఆహార సంక్షోభానికి పరిష్కారం లభించదని పేర్కొంది. ఈమేరకు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ (జీటీ) , భారత్‌కు మద్దతుగా ఒక ఎడిటోరియల్ ప్రచురించింది. గోధుమ ఎగుమతులను నిషేదించ వద్దని జీ 7 దేశాల వ్యవసాయ మంత్రులు భారత్‌ను కోరారు. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు ? అని జీటీ సంపాదకీయం ప్రశ్నించింది.

భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు అయినప్పటికీ , ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో ఒక చిన్న భాగమే అని తెలిపింది. మరోవైపు అమెరికా, కెనడా, ఈయూ, ఆస్ట్రేలియా వంటి కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్న సంగతిని చైనా గుర్తు చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం నెలకొన్న తరుణంలో పశ్చిమ దేశాలు గోధుమ ఎగుమతిని బాగా తగ్గించడాన్ని విమర్శించింది. ఈ నేపథ్యంలో సొంత ఆహార భద్రతపై నెలకొన్న ఒత్తిడిలో భారత్ తీసుకున్న నిర్ణయాన్నిజీ 7 దేశాలు విమర్శించడం తగదన్నది. దీనికి బదులుగా ప్రపంచ ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ 7 దేశాలు స్వాగతించాలని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News