దిస్పూర్: అస్సాంలో వరదలు ఆ రాష్ట్రంలోని ప్రజల జీవనోపాధిని అస్తవ్యస్తం చేశాయి. రోజు గడుస్తున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం, అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
వరదలు & కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటి వరకు 7 మంది ప్రాణాలు కోల్పోగా, 24 జిల్లాల్లో 2,02,385 మంది, 46 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 652 గ్రామాలు ఈ వరదల కారణంగా ప్రభావితమయ్యాయి. వరద నీటితో 16,645.61 హెక్టార్ల పంట భూములు మునిగిపోయాయి. అధికారికంగా ప్రకటించిన మొత్తం 7 మరణాలలో, కాచర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అదే జిల్లాలో ఇద్దరు పిల్లలతో సహా మరో ముగ్గురు తప్పిపోయారు. జిల్లా యంత్రాంగం 55 సహాయ శిబిరాలు మరియు 12 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది, ఇక్కడ 32,959 మంది వరద ప్రభావిత ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు.
బ్రహ్మపుత్ర నది నీటిమట్టం జోర్హాట్ జిల్లాలోని నీమతిఘాట్ వద్ద, నాగావ్ జిల్లాలోని కంపూర్ ప్రాంతంలోని కోపిలి నది వద్ద ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. న్యూ కున్‌జుంగ్, ఫియాంగ్‌పుయ్, మౌల్‌హోయి, నమ్‌జురాంగ్, సౌత్ బాగేటార్, మహాదేవ్ తిల్లా, కలిబారి, నార్త్ బాగేటార్, జియోన్ మరియు లోడి పాంగ్‌మౌల్ గ్రామాలలో కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. ఇండియన్ ఆర్మీ, పారామిలిటరీ బలగాలు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, SDRF, సివిల్ అడ్మినిస్ట్రేషన్ మరియు శిక్షణ పొందిన వాలంటీర్లు అస్సాం రాష్ట్రంలో తరలింపు , సహాయక చర్యల చేపట్టారు.
असम सैलाब में जब फंसी ट्रेन, बहा इंजन! #AssamFlood pic.twitter.com/jWuiG9y1vd
— AajTak (@aajtak) May 17, 2022