Sunday, April 13, 2025

కొవిడ్-19 వ్యాప్తిని గుర్తించేందుకు సైన్యాన్ని సమీకరించిన ఉత్తర కొరియా

- Advertisement -
- Advertisement -

North Korea amassed military

 

సియోల్: కొవిడ్-19 మందులను పంపిణీ చేయడానికి ఉత్తర కొరియా తన మిలిటరీని సమీకరించింది. రోగులను గుర్తించేందుకు  10,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలను మోహరించింది. ఉత్తరకొరియా ప్రస్తుతం  విస్తృతమైన కరోనావైరస్ వేవ్‌తో పోరాడుతోందని జాతీయ మీడియా అవుట్‌లెట్ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’  మే 17 న తెలిపింది.

ఏకాకి అయిన ఆ దేశం కొవిడ్-19 వ్యాప్తితో పోరాడుతోంది. వ్యాక్సిన్‌లు,  తగిన వైద్య మౌలిక సదుపాయాల కొరత కారణంగా పెద్ద సంక్షోభంకు ఆజ్యం పోసినట్లయింది. దేశ అత్యవసర అంటువ్యాధి నివారణ ప్రధాన కార్యాలయం జ్వరం లక్షణాలతో 2,69,510 మంది బాధపడుతున్నారని తెలిపింది.  కొవిడ్ సంక్రమణ అక్కడ ఇప్పుడు  మొత్తం 1.48 మిలియన్లకు చేరుకుంది. కాగా సోమవారం సాయంత్రం నాటికి మరణాల సంఖ్య ఆరు నుండి 56కి పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News