Saturday, December 28, 2024

ఢిల్లీ-జైపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five killed in road accident in Haryana

రేవారి: ఢిల్లీ-జైపూర్ హైవేపై ఔదీ గ్రామ సమీపంలో ఆగిఉన్న ట్రక్కును క్రూజర్ వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. హరిద్వార్‌లోని బంధువు చితాభస్మాన్ని గంగలో కలిపి ట్రాక్స్ క్రూయిజర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలోని సమాద్ గ్రామానికి తిరిగి వస్తుండగా హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఆడి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సమాద్ గ్రామానికి చెందిన మాలు రామ్, మహేందర్ కుమార్, సుగ్న, ఆశిష్, భోరి దేవిగా గుర్తించారు. క్షతగాత్రులను రేవారీ జిల్లాలోని బవాల్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. హరిద్వార్‌లోని గంగలో తన తండ్రి చితాభస్మాన్ని నిమజ్జనం చేసి క్రూయిజర్‌లో మాలు రామ్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సమూద్‌కు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది” అని రేవారీ పోలీసు ప్రతినిధి తెలిపారు. బవాల్‌కు చెందిన పోలీసు సిబ్బంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News