- Advertisement -
గద్వాల్: జోగులాంబ గద్వాల మానవపాడు మండలం నారాయణపురం స్టేజీ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్- బెంగళూరు హైవేపై వేగంగా వచ్చి అదుపు తప్పిన కారు ఆటోను వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -