Monday, December 23, 2024

ప్లాస్టిక్ సర్జరీ వికటించి కన్నడ నటి మృతి

- Advertisement -
- Advertisement -

Kannada actress dies after undergoing plastic surgery

బెంగళూరు : అదనపు కొవ్వును తొలగించే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 21 ఏళ్ల కన్నడ యువనటి చేతన్ రాజ్ అనారోగ్య సమస్యలతో మంగళవారం మృతి చెందారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీ కోసం సోమవారం బెంగళూరు లోని డాక్టర్ సెట్టీస్ కాస్మొటిక్ సెంటర్ అనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. సర్జరీ తరువాత చేతన్ రాజ్ ఊపిరితిత్తుల్లో ద్రవం నిండిపోయి గుండెపోటుతో మరణించారని డాక్టర్లు చెప్పినట్టు చేతన్ తండ్రి కె. వరదరాజ్ చెప్పారు. వైద్యుల నిర్లక్షం కారణం గానే ఇలా జరిగిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై డాక్టర్లు స్పందిస్తూ చేతన్ ఆరోగ్యం క్షీణించడంతో 45 నిమిషాల పాటు సీపీఆర్ పద్ధతిలో వైద్యం అందించామని, అయినా ఫలితం లేకపోవడంతో సమీపం లోని కాడే ఆస్పత్రికి తరలించినట్టు డాక్టర్ మెల్విన్ తెలిపారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్టు పేర్కొన్నారు. నటి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు యాడ్‌లు, సీరియల్స్‌లో నటించి చేతన్ రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News