Tuesday, December 24, 2024

భగ్గుమన్న టమాటా….. సెంచరీ కొట్టిన ధర

- Advertisement -
- Advertisement -

అదేబాటలో మరికొన్నికూరగాయలు
ప్రకృతి వైపరిత్యాలతో తగ్గిన దిగుబడి
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక

Tomato cost is RS 100

మనతెలంగాణ/హైదరాబాద్:  మార్కెట్లో టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో టామాటా ధర సెంచరీ కొట్టేసింది. కేరళలో కిలో టమాటా రూ.100కు చేరింది. దేశరాజధాని ఢిల్లీలో సైతం అదే ధర పలుకుతోంది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని రైతు బజార్లు ప్రధాన మార్కెట్లలో కిలో టామాటా ధర రూ.54కి చేరుకుంది. ఇక రిటైల్ మార్కెట్లు తోపుడు బండ్లపైనై కూరగాయలు విక్రయిస్తున్న చిల్లర వ్యాపారుల వద్ద కిలో టామాటా ధర రూ.80పైనే ఉంది. గత వారం పది రోజుల కిందటి వరకూ కిలో 15రూపాయలు ఉన్న టామాటా ధరలు ఇంత పెద్ద ఎత్తున పెరిగిపోవటంతో వినియోగదారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

మధ్యతరగతి , అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు కూరగాయల ధరలు మరింత భారంగా మారుతున్నాయి. ప్రకృతి వైపరిత్యాల వల్ల టమాటా సాగు విస్తీర్ణం తగ్గటంతోపాటు ప్రతికూల వాతవరణ పరిస్థితులు పంట దిగుబడిపై కూడా ప్రభావం చూపుతున్నట్టు టమాటా సాగు రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో టామాటా సాగు రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా లేకపోవటంతో పోరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచే టమాటా ఉత్పత్తులను అధికంగా ఇక్కడికి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఏపిలో కూడా టామాటా ధరలు మంట పుట్టిస్తున్నాయి. దక్షిణభారతంలో టామాటాకు అతిపెద్ద మార్కెట్‌గా పేరుపొందిన అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లి మార్కెట్‌లో టమాటా పంట నాణ్యతను బట్టి కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. 15కిలోల టమాటా బాక్స్ ధర రూ.1150పలుకు తోంది.

మొన్నటి దాక పెరుగిన ఎండల ప్రభావం పంట దిగుబడిపై పడింది. అల్పపీడనాలు తుపాన్ల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కూడా టామాటా పంటదిగుబడిని కుంగదీస్తూన్నాయ. రైతుల నుంచి ఆశించిన స్థాయిలో పంట విక్రయానికి రాకపోవటంతో మార్కెట్‌లో వీటికి భారీగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మదనపల్లి, అనతంతపురం , పత్తికోండ , టమాటా మార్కెట్లకు వచ్చిన సరుకు వచ్చింది వచ్చినట్టుగా తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, పచ్చిమబెంగాల్‌కు ఎగుమతి చేస్తున్నారు. మరో రెండు వారాలాపాటు ఇదే రీతిలో టామాటా పంటకు డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరానికి టమాటా దిగుమతి 50శాతం తగ్గిపోయింది. రోజుకు 2.25లక్షల కిలోల టమాటా వస్తుండగా ఇది 75వేల కిలోలకు తగ్గిపోయింది. వస్తున్న సరుకు కూడా అధికంగా మహారాష్ట్ర నుంచే వస్తోంది.

టామాటా బాటలోనే మరికొన్ని కూరగాయలు:

మరికొన్ని కూరగాయల ధరలు కూడా టమాటా ధరల బాటలోనే పెరుగుతున్నాయి. బీరకాయలు కిలో రూ.45కు చేరాయి. రైతు బజార్లలో కిలో పచ్చిమిరపకాయల ధర కూడా రూ.40పలుకుతోంది . చిల్లర వ్యాపారుల వద్ద కిలో 65రూపాయలు పలుకుతోంది. వంకాయలు రూ.23, బెండకాయలు రూ.35, క్యాప్సికం రూ.50, కాకర కాయ రూ.45, బీరకాయ రూ.45, దొండకాయ రూ.19, గోకరకాయ రూ.28, దోసకాయ రూ.13, క్యాలీప్లవర్ రూ.35, బీట్‌రూట్ రూ.25,గుండుబిన్నిస్ రూ.100, గింజచిక్కుడు రూ.50, ఉల్లిగడ్డ రూ.12, ఆలుగడ్డ రూ.25, సొరకాయ రూ.15,క్యారెట్ రూ.29, మొరంగడ్డ రూ.13,కందగడ్డ రూ.23, గుమ్మడికాయ రూ.13, పొట్లకాయ రూ.18 ధరలతో విక్రయిస్తున్నారు.అయితే చిల్లర వ్యాపారుల వద్ద కూరగాయల ధరలు రైతుబజార్ల ధరలతో పోలిస్తే కిలోకు రూ.20నుండి రూ.30 అధికంగా ఉంటున్నాయి.

దెబ్బతీసిన అసని తుపాన్ :కేంద్రం నివేదిక

అసని తుపాన్ టామాటా పంటను దెబ్బదీసిందని అందుకే ఉత్పత్తి పడిపోయిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంగళవారం నాడు నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఎండల తీవ్రత పెరగటం , వేడిగాలులు కూడా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపాయని తెలిపింది. టమాటా సాగులో ముందుండే ఆంధ్రప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాల్లో టామాటా పంట నష్టాలు అధికంగా ఉన్నట్టు నివేదికలో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News