Saturday, November 16, 2024

క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై సిబిఐ దాడులు

- Advertisement -
- Advertisement -

CBI attacks on cricket betting mafia

హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్‌పూర్‌లో నిందితులపై కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : ఐపిఎస్ క్రికెట్ బెట్టింగ్ మాఫియాకు సంబంధించి హైదరాబాద్ నగరంలో నాలుగు ప్రాంతాలలో సిబిఐ అధికారుల బృందం సోదాలు జరిపింది. హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్‌పూర్‌లలో బెట్టింగ్ మాఫియా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని గుట్టుగా 2013 నుంచి బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సిబిఐ గుర్తించింది. ముఖ్యంగా హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్‌పూర్‌లో కొందరు పాకిస్తాన్ కేంద్రంగా ఈ మాఫియా బెట్టింగ్ నడుపుతున్నట్లు సిబిఐ దృష్టికి వచ్చింది. ఈక్రమంలో గత వారం రోజులుగా నిఘా సారించిన సిబిఐ అధికారులు ఢిల్లీ, జోధ్ పూర్, జైపూర్, హైదరాబాద్‌లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసులపై కేసులు నమోదు చేశారు. అలాగే బెట్టింగ్ మాఫియాలో కొందరు ప్రైవేటు వ్యక్తులు, గుర్తు తెలియని ప్రభుత్వాధికారులు ఉన్నట్లు అనుమానించిన సిబిఐ అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం.

ఇదిలావుండగా హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్‌పూర్‌లలో బెట్టింగ్ మాఫియాపై ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు సిబిఐ అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఎఫ్‌ఎస్‌ఐఆర్ ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీశ్, గుర్రం వాసులు అనే వ్యక్తలు పేర్లు కూడా ఉన్నాయి. నిందితులు ఐపిఎల్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే విధంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారన్న సమాచారం మేరకు సిబిఐ అధికారులు ఆదిశగా దరాప్తు చేపడుతున్నారు. ఈ నేపత్యంలో నిందితులు బ్యాంకు ఖాతా ద్వారా ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. 2013 నుంచి ఈ నెట్‌వర్క్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోందని ముఖ్యంగా పాకిస్తాన్‌కు చెందిన వాకస్ మాలిక్ పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసింది.

పాకిస్తాన్ నుంచి గుర్రం సతీషు వాకస్ మాలిక్ డైరెక్ట్ కాంటాక్ట్ చేసినట్లు కీలక ఆధారాలు లభించాయని, అలాగే బెట్టింగ్‌లకు సంబంధించి ఢిల్లీకి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో 2013 నుంచి దాదాపు రూ. 43 లక్షలకు పైగా నిధులు ఉన్నట్లు తేలడంతో ఆయా అంశాలను సిబిఐ అధికారులు ఎస్‌ఐఆర్ పేర్కొన్నారు. కాగా సిబిఐ నమోదు చేసిన రెండో ఎస్‌ఐఆర్ సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ అనే వ్యక్తుల పేర్లు చేర్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్,ఢిల్లీ,జైపూర్,జోధ్‌పూర్‌లో నిందితులు పెద్ద ఎత్తున బూకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ మాఫియా నిర్వహిస్తున్నారన్న కోణంలో సిబిఐ అధికారులు విచారణ చేపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News