Monday, December 23, 2024

ఎవరెస్ట్‌ను అధిరోహించిన అన్వితారెడ్డి

- Advertisement -
- Advertisement -


మనతెలంగాణ/ హైదరాబాద్ : పర్వతారోహకురాలు అన్వితారెడ్డి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. భువవగిరికి చెందిన పడమటి మధుసూధన్‌రెడ్డి, చంద్రకళ దంపతులకు 1997లో జన్మించిన అన్విత రెడ్డి జన్మించారు. భువనగిరిలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్, ఇన్‌స్ట్రక్టర్ శిక్షణను పూర్తి చేసి, పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్ పర్వతారోహణ కోర్సులను పూర్తి చేశారు. 2021లో ఖాడే, కిలిమంజారో పర్వతాలను ఆమె అధిరోహించారు. డిసెంబర్‌లో ఎల్బ్రస్ పర్వతాన్ని (యూరోప్ ఖండంలోని ఎత్తైన శిఖరం) అధిరోహించిన ఏకైక భారతీయురాలిగా ఆమె రికార్డుల కెక్కారు.

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం కోసం ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ ద్వారా 2022 జనవరిలో ప్రత్యేక శిక్షణ కోర్సును పూర్తి చేశారు. హైదరాబాద్‌కు చెందిన అన్విత గ్రూప్ అధినేత అచ్చుతరావు బొప్పన పర్వతారోహణలో అన్వితారెడ్డి ప్రతిభను గుర్తించి, ఆమె లక్ష్యాలను సాధించేందుకు పూర్తి స్దాయి స్పాన్సర్‌షిప్‌తో మద్దతుగా నిలిచారు. ఈ నె 16న సముద్ర మట్టానికి 8848.86 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ శిఖరాన్ని ఆమె అధిరోహించారు.

ఏప్రిల్ 17న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు ఆమె చేరుకున్నారు. మే 12న బేస్ క్యాంప్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు, వివిధ స్థాయిలలో నాలుగు శిబిరాలను దాటారు. తన షెర్పా గైడ్‌తో క్యాంప్- 4 నుంచి 15 మే 2022 రాత్రి బయలుదేరి 16 మే 2022న ఉదయం 9.30 గంటలకు ఎవరెస్ట్ శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకున్నారు. ప్రస్తుతం అమె శిఖరం నుంచి బుధవారం నాటికి బేస్ క్యాంప్‌కు చేరుకుని ఈ నెలాఖరుకు హైదరాబాద్ వస్తారు. అన్వితా గ్రూపు అధినేతలు బొప్పన అచ్యుతరావు, నాగభూషణం అన్వితారెడ్డిని అభినందించారు. అన్విత కృషి, పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News