ఉదయం 11గంటలకు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ఐదవ విడత పల్లె, పట్టణ ప్రగతిపై బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరగనుంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. శరవేగంగా అభివృద్ధి దిశగా దూ సుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కా ర్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే నాలుగు విడుతల కార్యక్రమాలను పూర్తి చేసిన ప్రభుత్వం ఐదవ విడుతకు సిద్దమవుతోంది. పది రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో నిర్దిష్టంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? స్థానికంగా తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి? స్థానిక ప్రజలను, ప్రజాప్రతినిధులను, వివిధ విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి అధికారులను ఎలా భాగస్వామ్యం చేసుకోవాలి?
తదితర అం శాలపై సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రధానంగా మరింత మెరుగ్గా పారిశుద్ధ కార్యక్రమాలను చేపట్టడంపై అధికారులకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ పలు సూచనలు, సలహాలు జారీ చేయనున్నా రు. అలాగే నాలుగు విడతల వారిగా జరిగిన గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులను కూడా కెసిఆర్ సమీక్షించనున్నారు. మంత్రివర్గ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు, లోకల్ బాడీ కలెక్టర్లు, అన్ని జిల్లాల డిపిఒలు, అటవీశాఖ అధికారులు, మున్సిపల్ కార్పోరేషన్ల మేయర్లు, కమిషనర్లు తదితర సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొంటారు.