Monday, December 23, 2024

భజరంగ్, రవిలకు కామన్వెల్త్ బెర్త్

- Advertisement -
- Advertisement -

Bajrang punia Ravi dahiya qualify Common wealth Games

 

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, రవి దహియాలు ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ క్రీడల బెర్త్‌ను దక్కించుకున్నారు. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన అర్హత పోటీల్లో వీరు విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు వీరు అర్హత సాధించారు. జులై 28 నుంచి ఈ క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక పురుషుల విభాగంలో అగ్రశ్రేణి రెజ్లర్లు భజరంగ్, రవి దహియ అర్హత సాధించడంతో భారత్ పతకం ఆశలు చిగురించాయి. ఇక మహిళల విభాగంలో సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్‌లు కూడా ఈ క్రీడలకు అర్హత సాధించారు. ఒలింపిక్స్ తర్వాత రెండో అతి పెద్ద క్రీడా సంగ్రామంగా కామన్వెల్త్ గేమ్స్ పేరు తెచ్చుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News