Sunday, December 22, 2024

మాస్‌ని అలరించేలా పార్టీ సాంగ్

- Advertisement -
- Advertisement -

Life Ante Itta Vundaala lyrical Song released from F3
ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’ మూవీ ఈ నెల 27న థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించడానికి సిద్ధమవుతోంది. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్ళుగా సందడి చేయబోతున్న ఈ మూవీని నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘ఎఫ్ 3’లో మరింత గ్లామర్ జోడించింది ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ గా వచ్చిన ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా’ సాంగ్. పూజా హెగ్డేతో కలిసి వెంకటేష్, వరుణ్ తేజ్ సందడి చేయబోతున్న ఈ పాట సినిమాపై అంచనాలని పెంచేసింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పాట కోసం క్యాచి డ్యాన్సింగ్ ట్యూన్‌ని కంపోజ్ చేశారు. దేవిశ్రీ తనదైన శైలిలో స్వరపరిచిన ఈ పార్టీ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ నెక్స్ లెవెల్ లో ఉంటాయి.

వెంకటేష్, వరుణ్ తేజ్ కూడా ఈ పాటలో తమ గ్రేస్‌తో అదిరిపోయే మూమెంట్స్ చేశారు. నాగినీ మ్యూజిక్‌కి పూజా, వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన స్నేక్ డ్యాన్స్ మాస్‌ని అలరించేలా ఉంది. ఈ సాంగ్‌లో సునీల్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ కూడా ఆకట్టుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉంది. మనిషి పెద్ద కలలు కనాలి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే సందేశం ఈ పాటలో వుంది. రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఫుల్ ఎనర్జీతో ఈ పాటని ఆలపించారు. ఈ పార్టీ సాంగ్‌లో పూజా హెగ్డే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఎఫ్ 3’లో తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా సందడి చేస్తున్నారు.

Life Ante Itta Vundaala lyrical Song released from F3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News