- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి ఎజి పేరరివాలన్ విడుదలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. తన అల, చవకబారు రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని హంతకుడిని విడుదల చేయవలసిన పరిస్థితిని సుప్రీంకోర్టులో సృష్టించిందని ఆరోపించింది. ఈ పరిణామం పట్ల ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలోనే కాక దేశంలోని ప్రతి పౌరునిలో ఆవేదన, ఆక్రోశం పెల్లుబుకుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా బుధవారం నాడిక్కడ పేర్కొన్నారు. తీవ్రవాద అంటే తీవ్రవాదేనని, వారందరినీ ఒకే విధంగా చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హంతకుడి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల తాము తీవ్రంగా విచారించడంతోపాటు అసంతృప్తి చెందుతున్నామని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -