Monday, December 23, 2024

ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిఎం వెన్నంటే

- Advertisement -
- Advertisement -

రానున్న రోజుల్లో పెండింగ్ సమస్యలకు పరిష్కారం
టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్

CM support to Employees

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్జీఓ నాయకులు బల్కంపేట అమ్మవారికి బోనాలను సమర్పించారు. టిఎన్జీఓ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డా. ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా భారీ సంఖ్యలో మహిళా ఉద్యోగులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్‌లు హాజరై మాట్లాడుతూ ఉద్యోగులకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే దానిని పరిష్కరించడానికి సిఎ కెసిఆర్ వెంటనే స్పందిస్తున్నారన్నారు.

రానున్న రోజుల్లో కూడా పెండింగ్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. టిఎజ్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నిరంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే మరిన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రామినేని శ్రీనివాస్ రావు, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్‌తో పాటు పత్యేక ఆహ్వానితులుగా డా.అయాచితం శ్రీధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్, తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్, ఏ.వి.రెడ్డి, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్తాలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News