- Advertisement -
లండన్: ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ బోర్డు బుధవారం అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో నెదర్లాండ్స్‌తో జరిగే సిరీస్ నుంచి మాట్ ఇంగ్లండ్ జట్టు కోచ్ బాధ్యతలు చేపడుతాడు. నాలుగేళ్ల పాటు మాట్ ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం మాట్ ఆస్ట్రేలియా మహిళల టీమ్ ప్రధాన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మాట్ పర్యవేక్షణలోనే ఆస్ట్రేలియా విమెన్స్ టీమ్ మూడు ప్రపంచకప్‌లను గెలుచుకొంది. ఇక ప్రపంచంలోని అగ్రశ్రేణి కోచ్‌లలో ఒకడిగా మాట్ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు టీమ్ ప్రధాన కోచ్‌గా బ్రెండన్ మెకొల్లమ్ ఎంపికైన విషయం తెలిసిందే.
- Advertisement -