Saturday, December 21, 2024

పిహెచ్‌ఎం పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం

- Advertisement -
- Advertisement -

Finance Ministry approval for PHM posts

సిఎం కెసిఆర్‌కు పిఆర్‌టియుటిఎస్ కృతజ్ఞతలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను 10 వేలకు పెంచుతున్నట్లుగా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా అదనంగా 5,571 నూతన పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ మంత్రి టి. మంత్రి హరీష్ రావు పిహెచ్‌ఎం పోస్టులకు మంజూరు ఫైల్‌పై సంతకం చేశారు. తమ సంఘం ప్రాతినిధ్యం మేరకు ప్రభుత్వం ఈ పోస్టులను మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్ రెడ్డి,బీరెల్లి కమలాకర్ రావులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించి వారం రోజులలోపు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News