Saturday, December 21, 2024

కడుపుబ్బ నవ్వించే పాత అలీని చూస్తారు

- Advertisement -
- Advertisement -

Ali act in F3 Movie

 

“ఎఫ్ 3… పక్కా పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది” అని ప్రముఖ కమెడియన్ అలీ అన్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో కడుపుబ్బ నవ్వించే పాత అలీని చూస్తారు. నా క్యారెక్టర్‌లో అంత సత్తా ఉంది.

శిరీష్ అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు పాల బేబీ. వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం. సినిమా చివరలో మీకు ఆ విషయం తెలుస్తుంది. సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలో ఒకరిని మించి ఒకరు బాగా నటించారు. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం.

వెంకటేశ్, వరుణ్‌తేజ్ ఇద్దరు అద్భుతంగా నటించారు. సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి. దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం నేను అంటే సుందరానికి, లైగర్, ఖుషీ, ఒకే ఒక జీవితం సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా నటిస్తున్నా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News