న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 2364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. దీంతో నిన్నటి కేసుల కంటే దాదాపు 29.3 శాతం అధికంగా పెరిగినట్లు తెలిపింది. కరోనాతో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. దేశంలో మొత్తం కేసులు 4.31కోట్లకు చేరుకోగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,24,303 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 2,582 మంది వైరస్ నుంచి బయటపడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.25కోట్ల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో 532, కేరళలో 596, మహారాష్ట్రలో 307, హర్యానాలో 257, ఉత్తరప్రదేశ్‌లో 139 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లోనే సగానికి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 191కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
India Reports 2364 new corona cases