Monday, December 23, 2024

డా.వైయస్సార్ సంచార పశుఆరోగ్య సేవ పథకానికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకందారుల ఇంటి వద్దకే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డా.వైయస్సార్ సంచార పశుఆరోగ్య సేవ పథకానికి శ్రీకారం చుట్టారు. అనారోగ్యానికి గురైన పాడి పశువుల చికిత్స కోసం1962 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి అంబులెన్స్ సేవలు పొందవచ్చు. వాహనాలను క్యాంపు కార్యాలయం నుండి సిఎం శ్రీ వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. రూ.278 కోట్లతో 340 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు.

ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తారు. అవసరమైతే పశువును దగ్గరలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరుస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News