Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో కొవిడ్ కొత్త రకం బిఎ 4 ?

- Advertisement -
- Advertisement -

Covid new type BA4 in Hyderabad?

ఒమిక్రాన్‌కు అనుబంధం..వేగవంత వ్యాప్తి లక్షణం

హైదరాబాద్ : కొవిడ్ వైరస్‌లో కొత్త రకం ఒమిక్రాన్ అనుబంధం బిఎ .4 దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి సోకింది. కొవిడ్ కారక సార్స్ కొవ్ 2 వైరస్‌లలో ప్రమాదకరం ఒమిక్రాన్ అయితే దీనిని మించిపోయే రీతిలో ఈ బిఎ 4 వేరియంటు అత్యంత చేటుదనం సంతరించుకుంది. మనిషిలోని రోగనిరోధక శక్తిని చీల్చుకుంటూ వెళ్లడం, ఇంతకు ముందు వైరస్ వచ్చి నయం అయిన వారికి కూడా ఇది సోకడం, పైగా కొవిడ్ నిరోధక పలు దశల వ్యాక్సిన్లు పొందిన వారిలో కూడా ఇది సంక్రమించే ప్రమాదం ఉంది. ఈ విధంగా దీని మూలకణాలు అత్యంత శక్తివంతంగా ఉన్నాయని నిపుణులు తేల్చారు. కొవిడ్ 19 జీనమ్ కదలికలు స్వరూపాల పర్యవేక్షణ కార్యక్రమం దశలో హైదరాబాద్‌లో ఈ కొత్త రకం వేరియంటు ఉనికి ఉన్నట్లు గుర్తించారు.

ఇండియాలో ఈ సరికొత్త వేరియంటు వివరాలు ఇటీవలే అంతర్జాతీయ స్థాయిలోని అంటువ్యాధుల సమాచార వినిమయ సమాఖ్యకు అందాయి. ఈ దశలోనే భారతీయ వైద్య పరిశోధనా మండలి ( ఐఎంసిఆర్) కూడా దేశంలోని పలు నగరాలలో ఈ వైరస్ తలెత్తినట్లు ఇప్పటికైతే హైదరాబాద్‌లో ఇది నిర్థారణ అయినట్లు తెలిపింది. ఈ రకం వేరియంటు ఎక్కడైనా కరోనా వైరస్ తిరిగి విజృంభించే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో బిఎ . 2 సబ్‌వేరియంటు పెను ముప్పు తెచ్చిపెట్టింది. ఇప్పుడు హైదరాబాద్‌లో తలెత్తినట్లు చెపుతోన్న బిఎ 4 సబ్‌వేరియంటు తొలుత బిఎ 5 ఉప ఉపరకంతో పాటు ఈ ఏడాది జనవరిలోనే దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అప్పుడు ఇండియాలో ధర్డ్‌వేవ్ దశ ఉంది. బిఎ 4 ఒమిక్రాన్‌తో పోలిస్తే తక్కువ తీవ్రతతోనే ఉంటుంది. కానీ ఎక్కువగా సంక్రమించే రకం అని నిపుణులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News