Saturday, December 21, 2024

మీరట్‌లో గాడ్సే జయంతి

- Advertisement -
- Advertisement -

Nathuram Godse's birthday was celebrated by Hindu Mahasabha

మీరట్ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం నాధూరామ్ గాడ్సే జయంతిని హిందూ మహాసభ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. మహాత్మా గాంధీ హంతకుడు అయిన గాడ్సేకు భారీ స్థాయి నివాళులు అర్పించారు. మీరట్‌కు గాడ్సే కుటుంబానికి, పూర్వీకులకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని , మీరట్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని హిందూ మహాసభ రాష్ట్ర ప్రతినిధి అభిషేక్ అగర్వాల్ డిమాండ్ చేశారు. దేశంలో ఇప్పటికీ వేళ్లూనుకుని ఉన్న హిందూ వ్యతిరేక గాంధీవాదాన్ని నిర్మూలించి తీరుతామని హిందూ మహాసభ ప్రతిన వహించింది. అతి త్వరలోనే భారతదేశం పూర్తిస్థాయిలో హిందూ రాష్ట్రం అయి తీరుతుందని అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News