Friday, December 20, 2024

మునుపటి డెమొక్రట్లు కారు

- Advertisement -
- Advertisement -

My vote is for Republicans: Musk

నా ఓటు ఇక రిపబ్లికన్లకే : మస్క్

న్యూయార్క్ : తన ఓటు ఇకపై కేవలం రిపబ్లికన్లకే అని, డెమొక్రట్లకు వేసేది లేదని సంపన్నుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. గతంలో తన ఓటు వారికే పడుతూ వచ్చిందని, ఈ పార్టీ సౌమ్యులు సహృదయతల వ్యక్తుల పార్టీగా గుర్తింపు ఉండేదని , అయితే వారి నిజరూపం ఇప్పుడు వెల్లడైందని మస్క్ చెప్పారు. దేశంలో విభజన విద్వేషాలు రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. తాను ఇకపై వారికి మద్దతు ఇచ్చేది లేదని, రిపబ్లికన్లకే మద్దతు అని తెలిపారు. ఈ విధంగా చెపుతున్నందుకు ఇక ఆ పార్టీ తనపై ఎటువంటి బురదచల్లుడుకు దిగుతుందో అంతా చూస్తారని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అయితే ఆ పార్టీ ఇకపై తనపై మరింతగా రాజకీయ దుమారానికి దిగుతుందని ఇటీవలి కాలంలో బైడెన్‌పై పలు రకాల విమర్శలకు దిగుతోన్న మస్క్ వ్యాఖ్యానించారు. అత్యంత శక్తివంతమైన సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోళ్ల పనిలో దూసుకుపోతున్న మస్క్ ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత తన తొలి చర్య అవుతుందని కూడా ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News